నాని మరో మల్టీస్టారర్..!

-

నాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ వరకు సక్సెస్ జోష్ కొనసాగించగా ఈ ఇయర్ వచ్చిన రెండు సినిమాలు నిరాశపరచాయి. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అవగా.. నాగార్జునతో చేసిన దేవదాస్ సినిమా అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత నాని మరోసారి మోహనకృష్ణ ఇంద్రగంటితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అష్టాచమ్మతో నానిని హీరో చేసింది మోహనకృష్ణ ఇంద్రగంటినే. ఈ కాంబినేషన్ లో జెంటిల్మన్ అంటూ మరో హిట్ కూడా కొట్టారు. ముచ్చటగా మూడవసారి నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి పనిచేస్తారట. ఈ సినిమాలో నాని కాకుండా మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. దేవదాస్ ఫెయిల్ అయినా నాని మళ్లీ మల్టీస్టారర్ పై ఇంట్రెస్ట్ చూపడం ఆశ్చర్యంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news