పోలీస్ పాత్రలో నాచురల్ స్టార్

-

నాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున కలిసి చేస్తున్న దేవదాస్ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా నాని గౌతం తిన్ననూరి డైరక్షన్ లో జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో వరల్డ్ కప్ కు సంబందించిన సీన్స్ కూడా ఉంటాయట. ప్రముఖ క్రికెటర్స్ ను కూడా సిజి వర్క్ లో చూపిస్తారని తెలుస్తుంది.

ఇక దీనితో పాటుగా నాని చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో మూవీ కూడా ఓకే చేశాడు. స్క్రీన్ ప్లేలో బెస్ట్ అనిపించుకునే యేలేటి సినిమా అంటే ఏదో ఒక మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది. ఈ సినిమాలో నాని పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి కృష్ణార్జున యుద్ధం కాస్త షాక్ ఇచ్చింది. అందుకే దేవదాస్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

సినిమాల సెలక్షన్ లో నాని లెక్క వేరేలా ఉంటుంది. కాస్త రొటీన్ గా అనిపిస్తున్నాడు అన్న టాక్ రాగానే డిఫరెంట్ కథలకు ఓటేస్తున్నాడు. చూస్తుంటే దేవదాస్ నుండి మళ్లీ నాని తన హిట్ మేనియా కొనసాగించేలా ఉన్నాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version