సిఎం భార్య వెంటపడుతున్న దర్శక నిర్మాతలు

-

కర్ణాటక సిఎం కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. అసలు హీరోయిన్ గానే ఇండస్ట్రీకి పరిచయమైన రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు కుమారస్వామి. రాధిక తెలుగులో తారకరత్న హీరోగా భద్రాద్రి రాముడు సినిమా చేశారు. కొన్నాళ్లు సినిమా కెరియర్ కు గ్యాప్ ఇచ్చిన రాధికా ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నారు.

కన్నడ, తెలుగు పరిశ్రమలో పలు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు జేడి చక్రవర్తి, అర్జున్ హీరోలుగా చేస్తున్న కాంట్రాక్ట్ అనే తెలుగు సినిమాలో కూడా రాధిక కుమారస్వామి నటిస్తున్నారు. కాంట్రాక్ట్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రాధిక వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే రాజేంద్ర పొన్నప్ప, భైరా దేవి, నిమాగై సినిమాలకు ఆమె సైన్ చేసినట్టు తెలుస్తుంది.

ఓ పక్క కుమారస్వామి రాజకీయాల్లో బిజీగా ఉంటే రాధిక సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓ పాపకు తల్లైనా సరే శాండల్ వుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా వరుస అవకాశాలను అందుకుంటున్న రాధికను చూసి అందరు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version