నాని జెర్సీ రిలీజ్ డేట్ లాక్

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. దసరా రోజున షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ డేట్ ను నాని తన ట్విట్టర్ లో వెళ్లడించడం జరిగింది.

19 ఏప్రిల్ 19 హార్ట్ వార్మింగ్ సమ్మర్ రాబోతుంది అంటూ నాని జెర్సీ సినిమా రిలీజ్ డేట్ చెప్పారు. అంతేకాదు సినిమా రిలీజ్ 146 రోజులు ఉందని చెప్పారు. ఈ సినిమా కోసం నాని క్రికెట్ ప్రాక్టీస్ చేశారని తెలుస్తుంది. సినిమాలో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడట. కెరియర్ లో మొదటిసారి నాని మిడిల్ ఏజ్ రోల్ పోశిస్తున్నాడని తెలుస్తుంది.

ఏప్రిల్ 5న సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు నాని జెర్సీ రాబోతుంది. ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు మరి నానిని ఈ జెర్సీ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version