స్పిరిట్ ఆఫ్ జెర్సీ.. స్పూర్తి నింపే సాంగ్..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా భరత్ తిన్ననూతి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా మొన్నామధ్య సినిమా నుండి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమా నుండి రెండో సాంగ్ రిలీజైంది. స్పిరిట్ ఆఫ్ జెర్సీ అంటూ ఓ స్పూర్తిదాయకమైన సాంగ్ వచ్చింది.

అనిగిమనిగిన అలలిక ఎగసెను చూడరా.. అంటూ కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను కాల భైరవ పాడటం జరిగింది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ అదరగొట్టేసింది. నాని ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 19న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి సాంగ్ ఆకట్టుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news