మొదటిసారి తిరుమలకు వెళ్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

-

తిరుమల టూర్ కు మొదటిసారి వెళ్తున్నారా? అయితే మీరు ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. లేకపోతే లేని పోని ఇబ్బందుల్లో పడతారు. మొదటి సారి తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ముందుగా.. రైల్వే స్టేషన్ లో దిగినా… బస్ స్టాండ్ లో దిగినా.. లేక ఏర్ పోర్ట్ లో దిగినా.. ఎక్కడ దిగినా మీరు వెళ్ళవలసిన ప్లేస్ తిరుమల. అయితే తిరుమల కు వెళ్ళేముందు ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ లో దిగి ఉంటే.. ఫ్రెష్ అప్ అవాలనుకుంటే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అవొచ్చు. అది టిటిడి వాళ్లదే. ఉచితంగానే ఉంటుంది. ముందు ఫ్రెష్ అప్ అయ్యాక అప్పుడు తిరుమల కొండ మీదికి వెళ్ళడానికి ఆలోచించొచ్చు.

Are you going to tirumala first time, know these things first

మీరు ఫ్రెష్ అప్ అయి బయటికి వస్తే మీకు కొండ మీదికి బస్సులు ఉంటాయి. ఒకవేళ మీరు కొండ మీదికి నడిచి వెళ్ళాలనుకుంటే మాత్రం రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి అలిపిరి ద్వారా రెండోది శ్రీవారి మెట్లు. ఎక్కువ మంది వెళ్ళేది మాత్రం అలిపిరి. యువకులకు అయితే కనీసం 3 గంటలు పడుతుంది. మధ్యలోనే దర్శనం టోకెన్లు ఇస్తారు. వాటిని దగ్గర పెట్టుకొని దర్శనం ఈజీగా చేసుకోవచ్చు.

శ్రీవారి మెట్లు నుంచి అయితే ఓ గంట సమయం పడుతుంది. పైకి వెళ్ళాక నడుచుకుంటూ వస్తున్న వాళ్లకు సెపరేట్ లైన్ ఉంటుంది. బస్ ఎక్కి వచ్చిన వాళ్లకంటే నడుచుకుంటూ వచ్చిన వాళ్లకు త్వరగా శ్రీవారి దర్శనం జరుగుతుంది. నడవలేని వాళ్ళు డైరెక్ట్ గా బస్ ఎక్కి కొండ పైకి వెళ్లొచ్చు.

నడుచుకుంటూ వెళ్ళే వాళ్లకు వాళ్ళ లగేజిని కింద కౌంటర్లలో ఇస్తే మీరు పైకి వెళ్లే లోపు మీ లగేజి పైకి వస్తుంది. దర్శనం అయ్యాక లగేజి తీసుకో కొండ పైకి వెళ్ళాక సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక రూం బుక్ చేసుకుని లగేజి అందులో పెట్టుకొని దర్శనానికి వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news