రైతుగా నాని.. ఈ ట్విస్ట్ ఏంటి..!

-

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమాతో రాబోతున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నాని ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్నాడట. ఇన్నాళ్లు సినిమాల్లో యూత్ ఫుల్ గాయ్ గా కనిపించిన నాని ఈసారి కొత్తగా రైతు పాత్రలో నటిస్తున్నాడట. రైతుగా నాని ఇదేం ట్విస్ట్ అనేస్తున్నారు ఆడియెన్స్.

ఆరు వరుస విజయాలు అందుకున్న నాని ఈ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అవగా.. దేవదాస్ సినిమా కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దేవదాస్ సినిమా ఓపెనింగ్స్ అదరగొట్టినా తర్వాత మాత్రం పెద్దగా కలక్షన్స్ రాబట్టలేదు. నాని రైతుగా కనిపించే సినిమాకు దర్శకుడిగా కిశోర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. మరి నాని చేయబోతున్న ఈ ప్రయోగం ఏమేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news