శ్యామ్ సింగరాయ్ తో నాని కల నెరవేరనుందా..?

నేచురల్ స్టార్ నాని కెరీర్లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న శ్యాం సింగరాయ్ నుండి తాజాగా ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది. నిర్మాత మారాడని వచ్చిన వార్త తర్వాత తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని పాత్ర గురించి సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని, సినిమా డైరెక్టర్ గా కనిపిస్తాడట. సినిమాలో నాని పాత్ర డ్యుయల్ రోల్ అని వినిపిస్తుండడంతో ఒక పాత్రలో డైరెక్టర్ గా నాని కనిపిస్తాడట.

నిజానికి నాని సినిమాల్లోకి వచ్చింది దర్శకుడిగా మారడానికే. కొన్ని సినిమాలకి అసిస్టెంట్ గా కూడా చేసాడు. కానీ హీరోగా అవకాశం రావడం, ఆ సినిమా హిట్టవడంతో హీరోగా దూసుకెళ్తున్నాడు. హీరోగా బిజీగా ఉన్న నాని ఇప్పట్లో మెగాఫోన్ పట్టే అవకాశమే లేదు. కాకపోతే శ్యామ్ సింగ రాయ్ తోనైనా తన కల నెరవేరుతుందని అనుకోవచ్చు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువభాగం కలకత్తాలో జరగనుంది. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట.