KGF2 మేనియా..వెడ్డింగ్ కార్డుపై వినూత్నంగా ‘వయలెన్స్’ డైలాగ్

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా KGF2 మేనియా నడుస్తోంది. ఈ నెల 14న విడుదలైన ఈ పిక్చర్ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. దర్శకులు ప్రశాంత్ నీల్ – హీరో యశ్ ల వర్క్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్క క్షణం పాటు తాము కూడా హీరో యశ్ లా బిహేవ్ చేయాలనుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటీనీ దాటుకుని ముందుకు వెళ్తున్న KGF2..మేనియా ఇంకా కొంత కాలం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇ క ఈ పిక్చర్ లో యశ్ చెప్పిన ‘వయలెన్స్’ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘‘వయలెన్స్‌.. వయలెన్స్‌.. వయలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌..ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ’’ అని యశ్ స్టైలిష్ గా , పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్తుంటారు.

జనాలకు ఈ డైలాగ్ బాగా నచ్చింది కూడా. తాజాగా ఈ డైలాగ్‌ తరహాలో తన మ్యారేజ్‌ గురించి వెడ్డింగ్‌ కార్డ్‌పై ఒకరు డైలాగ్‌ ప్రింట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

కర్నాటక స్టేట్ లోని కిట్టురు డిస్ట్రిక్ట్ బెళగావి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌-శ్వేతల మ్యారేజ్ వెడ్డింగ్ కార్డులపై ‘‘మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. మ్యారేజ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌. ఐ అవైడ్‌. బట్‌, మై రిలేటివ్స్‌ లైక్‌ మ్యారేజ్‌. ఐ కాంట్‌ అవైడ్‌.’’ అని ప్రింట్ చేయించారు. ఇది చూసి యశ్ అలియాస్ రాఖీ భాయ్‌ ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. నెక్స్ట్ లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేజీఎఫ్, యశ్ లకు ఈ సినిమా ద్వారా సొంతమయిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news