మెడపై ముడతలా.. కారణాలు ఇవే కావొచ్చు.. ఇలా కవర్ చేసేద్దాం..!

-

కొందరికి.. ఫేస్ చాలా బాగుంటుంది కానీ.. మెడపై ముడతలు వస్తాయి. గొంతు దగ్గర సాగిపోయినట్లు ఉంటుంది. దీనివల్ల ఏజింగ్ లుక్ అనిపిస్తుంది. బరువు అధికంగా ఉండి తగ్గిన వాళ్లకు ఈ సమస్య బాగా ఉంటుంది. ఫేస్ మీద ముడతలు వస్తే ఓ హడావిడి చేస్తాం కానీ…మెడ మీద ముడతలను పెద్దగా పట్టించుకోరు. ఈరోజు మనం ఇలా ముడతలు రావడానికి ఉండే కారణాలు.. నాచురల్గా తగ్గించుకునే మార్గాలు చూద్దాం.

మెడపై ముడతలు రావడానికి కారణాలు..

ఎండవేడి కారణంగా వచ్చే యూవి కిరణాలు మెడ మీద పడటంతో కూడా ఇలా ముడతలు ఎక్కువ కనబడతాయి.
జెనటిక్ సమస్యలు, స్ట్రెస్, ఇతర కారణాలు సైతం మెడ మీద ముడతలకు కారణమౌతాయి.
స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు చర్మంలో సన్నని చారలు, ముడుతలు ఏర్పడతాయి.

ముడతలు నివారించడానకి సహజమైన పద్దతులు..

బొప్పాయి : మెడపై ముడుతలను తగ్గించడానికి బొప్పాయి నెంబర్ వన్ గా పనిచేస్తుంది.  బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , పెక్టిన్ చర్మంలో ముడతను నివారించడంలో సహాయపడుతుంది. బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా పేస్ట్ గా చేసి.. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు కూడా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
అరటిపండ్లు : అరటిపండ్లలో ఉండే విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్ మెడమీద ముడుతలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. బాగా పండిని అరటిపండును స్మూత్ గా పేస్ట్ చేసి మెడకు అప్లై చేయాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు రోజులు ఫాలో అయితే చాలు సూపర్ రిజల్ట్ మీరే చూస్తారు.
అలోవెర జెల్ : అలోవెర జెల్లో మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెడపై ఉండే ముడతలను నివారిస్తుంది. అలోవెరా జెల్ తీసుకుని..  మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మెడనలుపు కూడా తగ్గుతుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేసుకుంటే మరీ మంచిది.. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగితే సరి.
బాదం ఆయిల్ : బాదంను రెగ్యులర్ గా తినడం లేదా బాదం ఆయిల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో మీరు ఊహించని మ్యాజిక్ జరుగుతుంది. ముడుతలను నివారిచడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఓలియక్ యాసిడ్ స్కిన్ హెల్త్ కు మేలుచేస్తాయి. కొద్దిగా బాదం ఆయిల్ తీసుకుని, గోరువెచ్చగా చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేస్తే సరి.
క్యారెట్ : క్యారెట్ లో బీటా కెరోటీన్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ రీజనరేషన్ ను ప్రోత్సహిస్తుంది, కొల్లాజెన్ ప్రొడక్షన్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యారెట్ జ్యూస్ చేసి, ఆ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. తరచూ అప్లై చేస్తే.. స్కిన్ సూపర్ ఉంటుంది. క్యారెట్ ఆయిల్ ను వాడినా బాగుంటుంది.
ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ, ఏ లు ఫుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో అర టీస్సూన్ ఆర్గానిక్ హనీ మిక్స్ చేయాలి. అందులోనే కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి , మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి.
తేనె : స్కిన్ లేయర్స్ లోకి  తేనె అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి, పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో సహాయపడుతుంది. తేనెను మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. చర్మం టైట్ గా మారే వరకు అలాగే ఉండే తర్వాత చల్లటి నీటితో శుబ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం స్కిన్ కు బాగా హెల్ప్ అవతుంది.
మెంతులు: మెంతులు, మెంతి ఆకులలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇది ఫైన్ లైన్స్, ముడతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ఫ్రీక్వెంట్ గా ముఖం క్లీన్ చేస్తుండాలి. దాంతో చర్మం చూడటానికి టైట్ గా మారుతుంది. చర్మం స్మూత్ గా తయారవుతుంది.
ఇలా మీకు వీలైనది ఏదో ఒకటి రెగ్యులర్ గా ఫాలో అయితే.. మెడపై ముడతల సమస్యకు చెక్ పెట్టేయొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news