రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు…నాకు రూ. 5 కోట్లు ఇవ్వాలి : నిర్మాత నట్టి కుమార్

-

రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడని.. ఈ రోజు పుట్టిన రోజు కాబట్టి సినిమా విడుదల కాకుండా గిఫ్ట్ ఇచ్చానని నిప్పులు చెరిగారు. తన కు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలి.. ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ లేదని మండిపడ్డారు. సినిమా తీస్తాడు డబుల్ అగ్రీమెంట్ వేరే వాళ్లకు చేస్తాడని ఆరోపణలు చేశారు.

రామ్ గోపాల్ వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేసాను… కొంతమంది బ్రోకర్ల వలన రామ్ గోపాల్ వర్మ తన ప్రతిష్టను దిగజరుచుకుంటున్నాడని చురకలు అంటించారు. రేపు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న డేంజర్ సినిమా ఆపివేస్తూ సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.. రేపు డేంజర్ సినిమా ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు నిర్మాత నట్టి కుమార్. నన్ను ఒక్కడినే కాకుండా చాలామంది ని మోసం చేసాడు… సాయంత్రం 5 గంటల కు రామ్ గోపాల్ వర్మ బండారం బయటపెడుతానని హెచ్చరించారు నట్టి కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news