మోటో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఏప్రిల్ 8న భారత్ లో విడుదల కానున్న Moto G22

-

మోటో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ నెల 8న Moto G22 భారత్ లో విడుదల కానుంది. బడ్డెట్ లో బెస్ట్ ఫోన్ కొనానుకునేవారు.. ఓ సారి ఈ ఫోన్ ఫీచర్స్ చూసేయండి. మీరు ఇష్టపడొచ్చేమో కదా.. ఇంకెందుకు ఆలస్యం Moto G22 లో హైలెట్స్ చూసేద్దామా..!

భారత్‌లో మోటో జీ22 అంచనా ధర

యూరప్‌లో గత నెల విడుదలైన ఈ Moto G22 ఇప్పుడు భారత్‌కు వస్తోంది. యూరోపియన్ మార్కెట్‌లో ఈ మొబైల్‌ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 169.99 యూరోలు (సుమారు రూ.14,270)గా ఉంది. భారత్‌లోనూ దాదాపు.. ఈ మొబైల్‌ రూ.15వేలలోపు ధరకే వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అంటున్నారు.

మోటో జీ22 హైలెట్స్..

యూరప్‌ వేరియంట్‌లోని స్పెసిఫికేషన్లతోనే మోటో జీ22 భారత్‌లోనూ లాంచ్ అయ్యే అవకాశం ఉందట… 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.5 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ రానుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై Moto G22 రన్ అవుతుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో లాంచ్ కానుంది.
మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను మోటో అందించనుంది.
వెనుక నాలుగు కెమెరా సెటప్‌తో Moto G22 వస్తుంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉండనున్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెెమెరాతో రానుంది.
Moto G22 మొబైల్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 20వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్‌‌కు సపోర్ట్ చేస్తుంది.
పవర్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. ఈమధ్య అన్నీ ఫోన్లకు ఇదే ఆప్షన్ ఉంటుంది.
డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ లిస్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news