ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బిజీ అవుతున్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తవగానే ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఇకపోతే లైన్లోకి ప్రశాంత్ నీల్ నాచురల్ స్టార్ నాని ని తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది .ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఆరు సినిమాలు నాలుగు హిట్లు అన్నట్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న నాని మరొక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే సుందరానికి , దసరా వంటి సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంచాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాని ఈ సినిమాతో ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు.

ఇక ఇదిలా ఉండగా నాని తన తదుపరి చిత్రాన్ని ఒక మాస్ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. అసలు ఈ కాంబో సెట్ అవుతుందా అని కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత మరో రెండు సినిమాలు చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట నాని.అది కూడా హోంబలే ప్రొడక్షన్ హౌస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.