అబ్బో, త్రివిక్రమ్ తో నాని మూవీ ….??

-

ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ మూవీ ని తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దాని తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన రావడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా థమన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక దీనిని కూడా పూర్తి స్థాయిలో మంచి విజయవంతం చేసేలా కథ,

కథనాల విషయమై తన టీమ్ తో కలిసి ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారట త్రివిక్రమ్. ఇకపోతే ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాపై నేడు ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, నాచురల్ స్టార్ నాని తో త్రివిక్రమ్ అతి త్వరలో ఒక సినిమా చేయనున్నారని, కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అయిన అనంతరం, నాని తో సినిమా పనులు మొదలెడతారని అంటున్నారు. నాని కోసం కొద్దిరోజుల క్రితమే మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన త్రివిక్రమ్, అతి త్వరలో ఆయన్ను కలిసి స్క్రిప్ట్ ని వినిపించనున్నట్లు చెప్తున్నారు.

 

గతంలో నితిన్ తో తీసిన అఆ మాదిరిగా ఆ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుందని, ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించబోయే ఆ సినిమాకు సంబందించిన అన్ని వివరాలు రాబోయే మరొక రెండు నెలల్లో వెల్లడి కానున్నట్లు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ సినిమా కంటే ముందే మొదలు కావాలసి ఉందని, అయితే మరోవైపు నాని, ‘వి’ తో పాటు ‘టక్ జగదీశ్’ సినిమాలు చేస్తుండడంతో దీనిని త్రివిక్రమ్ ప్రక్కన పెట్టారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, నాని రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే…. !!

Read more RELATED
Recommended to you

Latest news