టిడిపి అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని వైజాగ్ లో వైసిపి కార్యకర్తలు అడ్డుకోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ‘ప్రజా చైతన్య యాత్ర’ ఉత్తరాంధ్రలో చేపట్టాలని విశాఖ విమానాశ్రయంలో దిగి కాన్వాయ్ ఎక్కిన చంద్రబాబుకి రోడ్డు పైకి రాగానే కాన్వాయ్ ను అడ్డుకుని వైసిపి కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలతో చంద్రబాబు కి చుక్కలు చూపించారు.
వైసీపీ కార్యకర్తలు చేసిన హడావిడికి విమానాశ్రయం బయట చంద్రబాబు మూడు గంటల వరకు ఆగిపోయారు. దీంతో ఉన్న కొద్ది పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు రావడం జరిగింది. ఆ తరువాత చంద్రబాబుని అరెస్టు చేసి వెంటనే ఆయనతో మాట్లాడిన చంద్రబాబు వెనక్కి అడుగు వేయడానికి ఒప్పుకోకపోవడం తో బలవంతంగా ఆయన్ని హైదరాబాద్ విమానం ఎక్కించడం జరిగింది. వెళ్తూ వెళ్తూ మళ్లీ వైజాగ్ వస్తా ఈ సారి ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తా అని సవాల్ విసిరారు.
అయితే ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పాటు జాతీయ స్థాయిలో కూడా హైలెట్ కావడంతో ఢిల్లీలో ఉన్న బిజెపి నాయకులు జగన్ ని మెచ్చుకున్నట్లు సమాచారం. అప్పట్లో నిన్ను విమానాశ్రయంలో రన్ వే పై కూర్చోబెట్టి పోలీసుల చేత తిరిగి వెనక్కి పంపించిన చంద్రబాబుని, నువ్వు రోడ్డుమీద తీసుకువచ్చి తిరిగి హైదరాబాద్ కి బాగా పంపించావు, రివెంజ్ అదరగొట్టే రీతిలో తీర్చుకున్నావు అంటూ వైజాగ్ రివెంజ్ డ్రామా మీద డిల్లీ పెద్దలు కామెంట్లు చేసినట్లు సమాచారం.