‘‘జై బాలయ్య’’ అంటూ అభిమానులు ఊగిపోవాల్సిందే..NBK107 టైటిల్ అదేనట

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ‘‘అఖండ’’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ ఫిల్మ్ తర్వాత బాలయ్య లైనప్ మూవీస్ పైన భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేనితో సినిమాకు ఒప్పుకున్నారు బాలయ్య.

NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. హీరోయిన్ గా బ్యూటిఫుల్ శ్రుతిహాసన్ నటిస్తుండగా, కీలక పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తోంది. ఇక కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇందులో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నారు.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఫిల్మ్ టైటిట్ గురించి గత కొద్ది రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘‘జై బాలయ్య’’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ టైటిల్ అదే అయితే కనుక అభిమానులు ఇక థియేటర్ లో ఊగిపోవాల్సిందేనని సినీ పరిశీలకులు అంటున్నారు. తమ అభిమాన కథానాయకుడిని ‘‘జై బాలయ్య., జై జై బాలయ్య’’ అని నినాదాలు చేసే ఫ్యాన్స్ అదే పేరుతో ఉన్న సినిమాను చూసి సంతోషం పడుతారని అంటున్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news