యంగ్ హీరోకి బాలయ్య వార్నింగ్..!

-

యువ హీరోల్లో ఒక హిట్టు రెండు ఫ్లాపులుగా కెరియర్ కొనసాగిస్తున్న నాగ శౌర్య ఛలో సినిమా హిట్ తో మళ్లీ తన టాలెంట్ చూపించాడు. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తర్వాత నాగ శౌర్య మరోసారి తన ఓన్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ @నర్తనశాల. నందమూరి తారక రామారావు క్లాసిక్ సినిమాల్లో ఒకటైన నర్తనశాల టైటిల్ వాడేందుకు గట్స్ ఉండాలి.

అంతేకాదు ఇదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా చేద్దామని అనుకున్నారు. కాని అది కుదరలేదు. ఈ సినిమా టైటిల్ గురించి తెలుసుకున్న బాలయ్య నాగ శౌర్యకు ఫోన్ చేశారట. సినిమా టైటిల్ విషయంలో పెద్ద వాళ్ల అనుమతి పొందావా అని అడిగారట. ఆ సినిమా దర్శక నిర్మాతలలో ఎవరైనా పర్మిషన్ తీసుకున్నావా అని అడుగగా లేదని చెప్పాడట నాగ శౌర్య. దానితో నాగ శౌర్యకు వార్నింగ్ ఇచ్చాడట.

అయితే యువ హీరో కెరియర్ దృష్టిలో ఉంచుకుని సినిమా టైటిల్ పేరు నిలబడేలా ఉండాలని చెప్పారట. అందుకే నాగ శౌర్య రీసెంట్ గా నర్తనశాల టైటిల్ కు తగినట్టుగానే పెద్దాయన పరువు నిలబెట్టేలా సినిమా ఉంటుందని అన్నాడు. బాలయ్య వార్నింగ్ నాగ శౌర్య లైన్ లోకి వచ్చాడట. ఇక మీదట ఇలాంటి తప్పు జరుగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news