స్టైలిష్ ‘జైలర్’..రజనీకాంత్ సినిమాపై నెల్సన్ ఫుల్ ఫోకస్!

-

డార్క్ హ్యూమర్ కు కేరాఫ్‌గా నిలిచిన కోలీవుడ్ డైరెక్టన్ నెల్సన్ దిలీప్ కుమార్..ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ సినిమాపైన ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా సర్కి్ల్స్ టాక్ ప్రకారం..నెల్సన్ ఈ సినిమా స్టోరిపైన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

నెల్సన్..‘జైలర్’ కోసం.. తన గత చిత్రాలు ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’ల మాదిరిగా కామెడీకి అంతగా ప్రయారిటీ ఇవ్వకుండా కొంచెం రూట్ మార్చినట్లు సమాచారం. రజనీకాంత్ ను స్టైలిష్ గా చూపించడంతో పాటు ‘జైలర్’గా డిఫరెంట్ అవతార్ లో ప్రజెంట్ చేయాలని నెల్సన్ భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్, విలన్ , ఇతర పాత్ర ధారుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

నెల్సన్ దిలీప్ గత చిత్రం తలపతి విజయ్ ‘బీస్ట్’..తమిళనాట బాగా ఆడింది. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైన ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

Read more RELATED
Recommended to you

Latest news