కీర్తి సురేష్ పై నెటిజన్స్ ఫైర్.. నువ్వు కూడానా అంటూ..!

మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే మహానటిగా పాపులారిటీ దక్కించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉన్న ఎంతో మంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం లేదా తమ ఉనికిని చాటుకోవడానికి వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో కొంతమందిని ఆకట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు పద్ధతిగా చూసిన వీరిని ఇలా ఒళ్ళు చూపించుకుంటుంటే కొంతమంది అసహ్యించుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి జాబితాలోకి కీర్తి సురేష్ చేరిపోయింది. మొన్నటి వరకు ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాట సినిమా తర్వాత హద్దులు మీరుతూ గ్లామర్ షో చేస్తూ అందరి చేత ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఇకపోతే ఈమెపై ఉన్న అభిమానం కాస్త ఇలాంటి దుస్తుల్లో.. ఈమెను చూస్తుంటే పోతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తన నటనతో.. అందంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది . మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాతే సినీ పరిశ్రమకు పరిచయం అయింది. అంతేకాదు పాత్రల ఎంపిక విషయంలో అందరినీ అబ్బురపరిచింది.

మొదటిసారి పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తమిళ్లో కూడా నటించింది.. ఇక తెలుగు విషయానికొస్తే 2016లో నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై బాగా ఆకట్టుకుంది. మహానటి సినిమా తర్వాత ఆఫర్లు వరుసగా రావడమే కాదు ఈమెపై అభిమానం కూడా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి అందరూ ఫైర్ అవుతున్నారు. ఈమధ్య గ్లామర్ ను పరిచయం చేయడమే కాదు అవకాశాల కోసం బాగా వర్క్ అవుట్ లు చేసి సన్నబడింది . ఈమెను చూసి అవకాశాల కోసం నువ్వు కూడా దిగజారుతున్నావా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.