అందుకోసమే పవన్ భజన?.. బండ్ల గణేష్‌పై ఫైర్

-

బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అదంతా కాసేపు పక్కనే బెడితే ఆయన ప్రస్తుతం నిర్మాతగా ఓ బడా చాన్స్ కొట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ సారి ఆ సంగతేంటో చూద్దాం.

బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా సినీ పరిశ్రమకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో భారీ డైలాగ్‌లనే కొట్టాడు. ఈ సినిమాతో మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని ఆశపడ్డాడు. తీరా చూస్తే బండ్ల గణేష్ పాత్ర అందులో తేలి పోయింది. ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశావంటూ ఇంట్లో పిల్లలు కూడా బండ్లను ప్రశ్నించారట. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ భారీ స్కెచ్ వేసే పనిలోనే ఉన్నాడని టాక్.

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భక్తుడు, వీరాభిమాని. ఇంకేదైనా పేరు ఉంటే అది కూడా బండ్లకే వర్తిస్తుంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి ట్విట్టర్‌‌లో ఒకటే భజన చేస్తున్నాడు. తాజాగా పౌరుషం పొగరు రాజసం ధైర్యం నిజాయితీ = మా బాస్ ⁦అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ భజన అంతా దేనికి? సినిమా అవకాశం కోసమే కదా?.. పవన్ చాన్స్ ఇస్తాడేమో అనే ఇలా భజన చేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news