ఇవాళ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం రేవంత్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. వరుస సభలు, సమావేశాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొంటూ విపక్షాలపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేయలేదని మండిపడుతున్నారు. గత సర్కార్ వైఫల్యాలను, మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ ఎండగడుతున్నారు. ప్రధాని మోదీ తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు ఎలా ఎడుగుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news