లోబోపై ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు.. ఎందుకంటే

బిగ్ బాస్‌కు తెలుగు షోకు మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్ప‌టికి వ‌చ్చిన నాలుగు సీజ‌న్లు ఎంత‌గానో అల‌రించాయి. ఇక‌పోతే ఇప్పుడు అంద‌రూ ఎద‌రుచూస్తున్న బిగ్‌బాస్ 5 తెలుగు సీజ‌న్ ఆదివారం సాయంత్రం ఎంతో అట్ఠహాసంగా స్టార్ట్ అయిపోయింది. కాగా ఈ సీజ‌న్లో ఒకేసారి 19 కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో క్రేజ్ వ‌చ్చేసింది. వ‌రుస‌గా మూడోసారి కూడా అంటే సీజన్‌ 5కు నాగార్జున హోస్ట్‌గా చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే హౌస్‌లోకి అడుగు పెట్టిన ఒక్క రోజే అవుతున్నా కూడా కంటెస్టెంట్ లోబోపై అప్పుడే నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అదేంటి ఎలాంటి టాస్క్ లు జ‌ర‌గ‌లేదు క‌దా మ‌రి ఎందుకు అని అంటే గ‌తంలో ఆయ‌న చేసిన ప‌ని వ‌ల్లే ఇప్పుడు ఆయ‌నపై ట్రోలింగ్ న‌డుస్తోంది. గ‌తంలో లోబో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఆయ‌న‌కు కొత్త చిక్కుతు తెచ్చిపెడుతున్నాయి.

అదేంటంటే ఆయ‌న గ‌తంలో ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ త‌న‌కు బిగ్ బాస్‌లో జ‌రిగే ప‌నులు చాలా ఇరిటేట్ గా అనిపిస్తాయ‌ని తెలిపారు. ఎందుకంటే ఆ షోలో చేసే కంటెస్టెంట్లు త‌మ స‌హ‌జ‌త్వానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, అందుకే త‌న‌కు ఆ షో అంటూ పెద్ద‌గా న‌చ్చ‌దంటూ తెలిపారు. ఇక త‌నుకు బిగ్ బాస్ నుంచి ఎలాంటి ఆఫ‌ర్ వ‌చ్చినా చేయ‌బోనంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ఆయ‌న బిగ్ బాస్‌లోకి అడుగు పెట్ట‌డం పైగా బిగ్‌బాస్ అంటే చాలా ఇష్ట‌మంటూ చెప్ప‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అవ‌స‌రానికో మాట ఎందుకంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.