భీమ్లా నాయక్: ‘డానియల్ శేఖర్’ అప్డేట్ వచ్చేసింది

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా “భీమ్లా నాయక్ ” టైటిల్ ను ప్రకటించి పవన్ ఫాన్స్ లో ఊపు తెప్పించింది. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి… తాజాగా మరో అప్డేట్ రాబోతోంది. ఈ సినిమా నుంచి హీరో రానా లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమాలో డానియల్‌ శేఖర్‌ పాత్రలో రానా నటిస్తున్నట్లు… చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది క్లారిటీ ఇచ్చింది. ఇక డానియల్‌ శేఖర్‌ పూర్తి లుక్‌ ను… సెప్టెంబర్‌ 20 విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం.