బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా ‘దిల్ బెచారా’ (జులై 24) ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా హాట్‌స్టార్‌లో విడుదలై.. అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సుశాంత్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నివాళులు అర్ఫించారు. ‘దిల్ బెచారా’.. అభిమానుల నుంచి విశేషాదరణ పొందుతోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే, ఏ చిత్రానికి సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఐఎమ్‌డీబీలో తొలుత 10/10 మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం 9.8 రేటింగ్‌తో ఉంది. దీనితో పాటే ‘టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్’ జాబితాలో తొలి స్థానం చేజిక్కుంచుకుంది.
జున్ 14న తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. అతడు నటించిన చివరి చిత్రం ‘దిల్ బెచారా’ను థియేటర్లలోనే విడుదల చేయాలని అభిమానులు కోరారు. కానీ కరోనా వల్ల ఓటీటీలో తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా థియేటర్లో కానీ రిలీజ్ అయి ఉంటే ఒక్కరోజులోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయి అని విశ్లేషకులు చెబుతున్నారు.