ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఫిల్మ్ అయిన ‘సలార్’ డెఫినెట్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలోని రామగుండంలో ‘సలార్’ చిత్ర షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రజెంట్..రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. మాలీవుడ్(మలయాళం) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు వినికిడి.

saptagiri
saptagiri

యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘సలార్’ ఉండబోతున్నదని వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేయబోతున్నారట. అయితే, ఈ వార్తల్లో నిజమెంతుందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో వస్తున్న వార్త ల ప్రకారం..సప్తగిరి ఇప్పటికే ‘సలార్’ సినిమా కోసం డేట్స్ కేటాయించారట.