నాగార్జున టైటిల్‌తో విజయ్ సినిమా..సెంటిమెంట్ ఫాలో అవుతున్న దిల్ రాజు!

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్..ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లితో సినిమా చేస్తున్నారు. ‘తలపతి 66’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ లో భారీ తారాగణమే ఉంది. ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీసిన తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న చిత్రం ఇది. కాగా, దీనిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ ఫిల్మ్ స్టోరిపైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ‘బీస్ట్’ తర్వాత విజయ్ చేస్తున్న 66వ చిత్రం ‘తలపతి 66’. కాగా, ఇందులో కథానాయికగా రష్మిక మందన నటిస్తోంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, జయసుధ, వెంకట్ ప్రభు, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా ఈ పిక్చర్ ఉండబోతున్నది.

హైదరాబాద్ లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ పూర్తయినట్లు సమాచారం. కాగా, త్వరలో ఈ చిత్రం నుంచి అధికారికంగా అప్ డేట్స్ రానున్నాయని టాక్. ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. గతంలో ఇదే టైటిల్ తో నాగార్జున సినిమా చేశారు. అది బ్లాక్ బాస్టర్ అయింది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ టైటిల్ కు ఓకే చెప్పినట్లు వినికిడి. విజయ్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతన్నాయి. ‘మాస్టర్, బీస్ట్’ సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడాయి. ‘మాస్టర్’ టైటిల్ తో గతంలో చిరంజీవి సినిమా చేయగా, అదే టైటిల్ వాడుకున్న తలపతి..ఈ సారి నాగార్జున టైటిల్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news