ప్ర‌భాస్ అవుట్‌… మెగా హీరో ఇన్‌

-

మెగాస్టార్ చిరంజీవితో సైరా లాంటి హిస్టారిక‌ల్ సినిమాను తెర‌కెక్కించిన సురేంద‌ర్‌రెడ్డి ఓ పెద్ద సినిమాను ఎంత స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేస్తానో త‌న‌కు తాను ఫ్రూవ్ చేసుకున్నాడు. సైరా విజయంతో సురేందర్ రెడ్డికి మంచి క్రేజ్ ఏర్పడింది. సైరా త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి ఏ సినిమా చేస్తాడు అన్న‌ది ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. సైరా హిట్ తర్వాత ప్రభాస్ తో ఓ మంచి సినిమా చేసి హిట్ కొట్టాల‌ని సురేంద‌ర్‌రెడ్డి ముందు నుంచి ప్లానింగ్ చేసుకున్నాడు.

సైరా షూటింగ్ కంప్లీట్ అయ్యే స‌రికి ప్ర‌భాస్ జాన్ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమా మ‌రో యేడాది పాటు షూటింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో సినిమా పూర్తయ్యే సరికి చాలా టైం పడుతుంది. ఈ క్ర‌మంలోలోనే సురేంద‌ర్‌రెడ్డి తాను ప్ర‌భాస్ కోసం రాసుకున్న క‌థ‌ను ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వినిపించాడట.

సురేంద‌ర్‌రెడ్డి క‌థ ఓకే చెప్ప‌డంతో వ‌రుణ్ కూడా ఈ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు టాక్‌. ఇక సురేంద‌ర్‌రెడ్డి కిర‌ణ్ కొర్ర‌పాటికి చేసే ప్రాజెక్టునే వ‌రుణ్‌తో చేస్తాడ‌ని అంటున్నారు. ఇక వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న వ‌రుణ్ ఈ యేడాది ఇప్ప‌టికే వెంకీతో క‌లిసి చేసిన ఎఫ్ 2 సినిమాతో హిట్ కొట్ట‌గా… ఇక రీసెంట్‌గా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో కూడా త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news