వయ్యారాల నిధి.. వరుస ఆఫర్లు కొట్టేస్తుంది

-

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొత్త హీరోయిన్ చమక్కులు బాగున్నాయి అంటే మాత్రం ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ నుండి వచ్చి వరుస టాలీవుడ్ ఆఫర్లు కొట్టేస్తున్న నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకుందని చెప్పొచ్చు. ఈమధ్యనే రిలీజైన నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటించిన అమ్మడు ప్రేక్షకులను మెప్పించింది.

సవ్యసాచి రిలీజ్ కు ముందే అఖిల్ తో మిస్టర్ మజ్ ను ఛాన్స్ అందుకుంది నిధి అగర్వాల్. అన్నదమ్ములు ఇద్దరితో జోడి కట్టిన ఈ అమ్మడికి ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చేందుకు సిద్ధమైన సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ పేరు వినిపిస్తుంది. దాదాపు అమ్మడు ఆ మూవీలో ఫైనల్ అయినట్టే అని టాక్. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన డైరెక్ట్ చేస్తున్నాడట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news