చరణ్ ‘వినయ విధేయ రామ’.. మాసీ ఫస్ట్ లుక్

-

ram charan vvr first look

రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా వినయ విధేయ రామా అని ఫిక్స్ చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని చరణ్ సరసన నటిస్తుంది. కొన్నాళ్లుగా ప్రచారం లో ఉన్న వినయ విధేయ రామా టైటిల్ నే చిత్రయూనిట్ కన్ఫాం చేయడం విశేషం. ఇక ఫస్ట్ లుక్ లో కత్తి పట్టుకుని పరుగెడుతున్న చరణ్ లుక్ అదిరిపోయింది.

పోస్టర్ లో చరణ్ సీరియస్ లుక్ హీరో క్యారక్టర్ ఇంటెన్స్ ను తెలియచేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా చరణ్ మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయం అనేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. వినయ విధేయ రామా టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా సినిమా మెగా మాస్ అభిమానులకు పండుగ తీసుకురావడం ఖాయమని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news