డాక్ట‌ర్‌తో టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమాయ‌ణం

-

యంగ్ హీరో నిఖిల్ కొన్నేళ్ల క్రితం స్వామిరారా, కార్తీకేయ‌, సూర్య‌వ‌ర్సెస్ సూర్య లాంటి హిట్ల‌తో దూసుకుపోయాడు. ఆ టైంలో నిఖిల్ మార్కెట్ బాగా పెరిగింది. ఆ త‌ర్వాత ఒక‌టి అరా ప్లాప్‌లు వ‌చ్చినా
ఎక్కడికి పోతావు చిన్నవాడా విజయాన్ని ఇచ్చినా దానిని క్యాష్ చేసుకోలేక‌పోయాడు తాజాగా నిఖిల్‌ నటించిన `అర్జున్ సురవరం` రిలీజ్ చిక్కులతో సతమతమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కోసం స‌రైన డేట్ లేక వెయిటింగ్ చేస్తున్నారు.

ఇదివరకూ పట్టాలెక్కిన `శ్వాస` అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ రెండు సినిమాల‌తో నానా క‌ష్టాలు ప‌డుతోన్న నిఖిల్ ప్ర‌స్తుతం చందు మొండేటితో కలిసి `కార్తికేయ-2` కోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే నిఖిల్ మంచు ల‌క్ష్మి రియాల్టీ షోలో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పాడు. తాను ప్రేమ‌లో ఉన్నాన‌న్న విష‌యం చెప్పిన అత‌డు… త‌న‌కు కాబోయే భార్య ఎవ‌రో కూడా చెప్పాడు.

ఆమె ఓ డాక్టర్. నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెషల్. తను నన్ను బాగా అర్థం చేసుకుంద‌ని… తాను షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు ఎప్పుడు డిస్ట‌ర్బ్ చేయ‌ద‌ని… ఇక త‌న ఫోన్ కూడా చెక్ చేయ‌ద‌ని చెప్పిన నిఖిల్
`నువ్వు ఎప్పుడు సరదాగా గడపాలని అనుకుంటే అప్పుడు గడుపు` అని నాతో అంటుంద‌ని చెపుతూ సంతోషం వ్య‌క్తం చేశాడు.

ఇక తాను చిన్న‌ప్ప‌టి నుంచి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరగడం వల్ల అప్పటి నుంచే ప్రేమ పెళ్లంటే ఇష్టం పెరిగింది అని నిఖిల్ అసలు సీక్రెట్ బయటపెట్టాడు. త‌న‌కు కాబోయే భార్య డాక్ట‌ర్ అని చెప్పిన నిఖిల్ ఆమె పేరు, కుటుంబ వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version