మార్చి 29న ఆ సినిమా వస్తుందా రాదా..!

-

నిఖిల్ హీరోగా సంతోష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అర్జున్ సురవరం. తమిళ సినిమా కణితన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించారు. ఇక ఈ సినిమా మార్చి 29న రిలీజ్ అన్నారు కాని రిలీజ్ వారంలో ఉన్నా ఎలాంటి సందడి లేదు. ఓ పక్క ఆరోజు రిలీజ్ కాబోతున్న నిహారిక సూర్యకాంతం, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తుంటే అర్జున్ సురవరం మాత్రం ఎలాంటి హడావిడి లేదు.

అర్జున్ సురవరం సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాపై ఆడియెన్స్ ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా రిలీజ్ వచ్చే శుక్రవారం అని చెప్పినా ప్రమోషన్స్ చేయకపోయే సరికి సినిమా ఆ టైం కు వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో హీరో హీరోయిన్ జర్నలిస్టులుగా నటిస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో హిట్ అయ్యింది కాబట్టి తెలుగులో కూడా ఆ రిజల్ట్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news