ఓం పుష్కరాక్షాయనమః అనే నామాన్ని జపిస్తే ఈరాశి వారికి అంతా శుభమే! మార్చి 23 రాశిఫలాలు

మేషరాశి : అన్ని అనుకూలాలే. కార్యజయం, అధిక ఆదాయం, ఇంట్లో సంతోష వాతావరణం.
పరిహారాలు  వేంకటేశ్వరస్వామి దేవాలయ సందర్శన, పూజ చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభరాశి : మంచి ఫలితాలు, కార్యజయం, పనులు పూర్తి, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, అమ్మవారికి పూజ చేసుకోండి.

March 23rd Saturday horoscope
March 23rd Saturday horoscope

మిథునరాశి : మిశ్రమ ఫలితాలు, అధికారులతో ఇబ్బందులు, స్థానమార్పులు, కొత్తవారితో పరిచయాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు- ఓం పుష్కరాక్షాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి : ప్రతికూల ఫలితాలు, ధననష్టం, ఇంట్లో సమస్యలు, విరోధాలు.
పరిహారాలు- ఓం పుష్కరాక్షాయనమః అనే నామాన్ని 108 సార్లు జపించండి.

సింహరాశి : ధననష్టం, విరోధుల వల్ల ఇబ్బందులు, విలువైన వస్తువుల పోయే సూచన.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి కొబ్బరికాయ కొట్టండి. వీలైతే పిండి దీపారాధన చేయండి.

కన్యారాశి : ప్రతికూల వాతావరణం, అనవసర కలహాలు, ఇంట్లో అనారోగ్య సమస్యలు.
పరిహారాలు- ఓం పుష్కరాక్షాయనమం అనే మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత 108 సార్లు జపించండి కుటుంబ సమస్యలు పోతాయి.

తులారాశి : శ్రమ అయినా మంచి ఫలితాలు, లాభం, కార్యజయం, స్థిర ఆస్తి సంబంధ విషయాల్లో లాభం.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం పూజ మంచిది.

వృశ్చికరాశి : అనుకూలం, ప్రతికూలం రెండు రకాలుగా ఉంటుంది. అకారణంగా వైరాలు, చేసే పనుల్లో నష్టం.
పరిహారాలు- ఓం పుష్కరాక్షాయనమః అనే నామాన్ని జపించండి.

ధనస్సురాశి : ఇబ్బందులు, వస్తునష్టం, చోరభయం, పనుల్లో ఆలస్యం, అలసట.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి పిండిదీపం చేసి ఆవునెయ్యితో దీపారాధన చేయండి

మకరరాశి : మంచి ఫలితాలు, వస్తులాభం, భార్యవర్గంతో అనుకూలత, పనులు పూర్తి.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, పూజ మంచి ఫలితాలు ఇస్తుంది.

కుంభరాశి: వ్యతిరేక ఫలితాలు, నష్టం, కార్యనష్టం, పనుల్లో ఇబ్బందులు.
పరిహారాలు- ఓం పుష్కరాక్షాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మీనరాశి : అన్ని వ్యతిరేక ఫలితాలు, ఆటంకాలు, అలసట, శ్రమ, పనుల్లో ఇబ్బందులు.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామికి పిండి దీపారాధన, ఇష్టదేవతారాధన చేసుకోండి.

-కేశవ