యంగ్ హీరో ట్రిక్‌కి త‌మ‌న్నా క్లీన్ బౌల్డ్‌!

-

యంగ్ హీరో నితిన్ మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా విష‌యంలో ట్రిక్ ప్లే చేశారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన హిందీ చిత్రం `అంధాధూన్‌`. జాత‌య స్థాయిలో ప‌లు అవార్డుల్ని అందించిన చిత్ర‌మిది. ట‌బు, రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ రీమేక్ చేస్తూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నారు. అయితే ఈ చిత్రంలోని ట‌బు, రాధికా ఆప్టే పాత్ర‌ల్లో త‌మ‌న్నా, న‌భా న‌టేష్ న‌టించ‌బోతున్నారు. ఇటీవ‌లే చిత్ర బృందం ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ముందు టబు పాత్ర‌లో న‌య‌న‌తార‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ న‌టిస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ పాత్ర టూ హాట్‌గా వుంటుద‌ని తెలియ‌డంతో ఈ ముగ్గురు ఆస‌క్తిని చూపించ‌లేదు.

కానీ ఫైన‌ల్‌గా ట‌బు పాత్ర‌లో మిల్కీవైట్ బ్యూటీ న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే టబు పాత్ర‌ని త‌మ‌న్నా అంగ‌క‌రించ‌డానికి యంగ్ హీరో నితిన్ ఓ ట్రిక్ ప్లే చేశార‌ట‌. ఈ పాత్ర‌లో న‌టించే న‌టి కోసం సినిమా ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో మిల్కీ బ్యూటీకి టెమ్టింగ్ ఆఫ‌ర్ ఇచ్చి క్లీన్ బౌల్డ్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట. ఆ ప్లాన్ ప్ర‌కార‌మే త‌మ‌న్నాని కోటిన్న‌ర ఆఫ‌ర్ ఇచ్చి క్లౌన్ బౌల్డ్ చేసిన‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news