వీడియో చాట్ యాప్ కి సంబంధించి ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అనుమతి లేకుండా కొందరు ఫోటోలను వినియోగించడంపై ఆమె కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేసారు. నుస్రత్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మను ట్యాగ్ చేసి, ప్రకటన యొక్క స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమెకు కమీషనర్ హామీ ఇచ్చారు.
ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.. సమ్మతి లేకుండా చిత్రాలను ఉపయోగించడం. కలకత్తా పోలీస్ యొక్క సైబర్ సెల్ ను దయచేసి పరిశీలించమని అభ్యర్ధిస్తున్నా. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నా అని ఆమె చెప్పారు. నుస్రత్ జహాన్ సిఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత వ్యక్తిగా చెప్తారు. ఆమె ముస్లిం అయినా సరే హిందువుగా రెడీ అయి పార్లమెంట్ కు వెళ్ళారు.