ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్‌..

2019 ఎన్నికల తరువాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో పవన్‌ ఓ రీమేక్‌ సినిమాతో సందడి చేయబోతున్నాడన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో అజీత్ చేసిన పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. హిందీ, తమిళ్ బాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, తెలుగులో దిల్ రాజుతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

అలాగే వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే తెలుగులో పింక్ రీమేక్‌లో నివేథా థామస్‌ని చిత్రయూనిట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా నివేథా థామస్‌కు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది అయితే అప్పుడు అది చెల్లెలు క్యారెక్టర్ కావడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇక ఈ సినిమా 2020వ సంవత్సరం జనవరి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా… ముందు నివేథా థామస్‌తో షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నారు.