తెలంగాణలో నో బెనిఫిట్ షో.. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం..!

-

నిర్మాతలకు టాలీవుడ్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అల్టిమేటం జారీ చేశారు. ఇక నుండి ర్మాతలు ఇతర రాష్ట్రాల తరహాలో తమకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మల్టీ ప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ ఇస్తేనే సినిమాల ప్రదర్శన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుండి సినిమాలు ప్రదర్శించబోమని తేల్చి చెప్పారు. దీనిపై అభిప్రాయం వ్యక్తం చేసేందుకు సినీ నిర్మాతలకు జూలై 1 వరకు గడువు ఇస్తున్నామని డెడ్ లైన్ విధించారు. భారీ బడ్జెట్ మూవీస్ ప్రభాస్ కల్కి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2, కమలహాసన్ భారతీయుడు 2 సినిమాలకు దీనిని నుండి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇక నుండి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించమని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్, ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పై నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఆక్యుపెన్సీ లేకపోవడం, ప్రేక్షుకులు థియేటర్లకు రాకపోవడంతో ఇప్పటికే తెలంగాణలో పది రోజులు పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసి వేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news