ఎన్టీఆర్ ‘కథానాయకుడు’.. నో ప్రీమియర్స్..!

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు ఈ నెల 9న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలను మీద వేసుకుని ఎంతో బాధ్యతగా చేసిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ఈ సినిమాకు సంబందించి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టగా సినిమా రిలీజ్ హంగమా నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతున్న ఎన్.టి.ఆర్ మూవీ 9న రిలీజ్ అవుతుండగా మొదటి రోజు అంటే 8నాడే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఓవర్సీస్ లో నందమూరి ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఈ ప్రీమియర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆంధ్రాలో కూడా ఎన్.టి.ఆర్ కథానాయకుడు ప్రీమియర్స్ తో పాటుగా పండుగ సెలవుల సందర్భంగా రోజుకి 6 షోలకు పర్మిషన్ తీసుకుంటున్నారట.

అయితే తెలంగాణాలో మాత్రం ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వట్లేదని తెలిసిందే. ప్రీమియర్స్ మాత్రమే కాదు నాలుగు షోలకు మించి పర్మిషన్ కూడా ఇవ్వడం కష్టమని అంటున్నారు. జరిగిన తెలంగాణా ఎన్నికల్లో బాలకృష్ణ టి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాబట్టి బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ కు తెలంగాణాలో కష్ట కాలమే అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.