సింహాలను చూస్తే మనుషులకు వద్దన్నా ఒకటో నెంబర్ పడిపోతుంది. మరి.. అంతటి భయంకరమైన సింహాల గుంపును ముగ్గురు యువకులు తరిమేశారు. వాటిని చేజ్ చేశారు. ఆ యువకులను చూసి సింహాలు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. ఎహె.. ఊరుకోండి. సింహాలు మనుషులను చూసి ఉరకడం ఏంది.. అంటారా? మీరు నమ్మరని తెలుసు. అందుకే మీకోసం దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది.
ఈ విచిత్ర ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లీలో ఉన్న లిల్యా తాలుకాలో చోటు చేసుకున్నది. బైక్ మీద ఉన్న ఇద్దరు యువకులు, పరిగెత్తుతూ మరో యువకుడు.. ముగ్గురు యువకులు మాత్రం సింహాలను కాసేపు దడ పుట్టించారు. వాటిని తరుముతూ.. తమ ఫోన్లలో ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్రేలీ జిల్లాలో దాదాపు 100 సింహాలు ఉన్నాయట. కొన్ని సింహాలు అయితే మానవ నివాసాలకు దగ్గర్లోనే ఉంటాయట. అందుకే.. వాటిపై మనుషులు ఇలా దాడులు చేస్తున్నారట. అటవీ శాఖ అధికారుల వైఫల్యం ఈ ఘటనతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై స్పందించిన అటవీ అధికారులు ఆ యువకుల కోసం గాలిస్తున్నారు.