పవన్ తో షూటింగ్లో పాల్గొనబోతున్న నోరా ఫతేహి.!

-

డైరెక్టర్ కృష్ణ దర్శకత్వంలో… నటసింహ నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి విజయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ లో వీరనారి ఝాన్సీ లక్ష్మీ స్టోరీ తో మణికర్ణిక చిత్రాన్ని రూపొందించిన చారిత్రక చిత్రాలు డీల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ సంపాదించారు డైరెక్టర్ క్రిష్ . ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే 90% పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా కంప్లీట్ చేశారు. ఇంకా కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. త్వరలో మొదలయ్యే షెడ్యూల్లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి పాల్గొనబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్లో ఈనెలాఖరు నుంచి పాల్గొనడానికి సిద్ధమవుతుందని సమాచారం. ఇకపోతే షూటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్లో ఆమెపై సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో నోరా ఫతేహి యువరాణిగా.. ఔరంగజేబు చెల్లెలు రోషనారా బేగం పాత్రలో కనిపించనుంది.

ఈమె షాజహాన్ మూడవ భార్య కూతురు పాత్రలో నటించబోతోంది. నిజానికి ఈ పాత్రకు ముందుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సెలెక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఈ అవకాశం నోరాఫతేహి కి లభించింది. బాలీవుడ్లో ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన ఈమె బాహుబలి చిత్రంలో మనోహరి పాటతో మరింతగా ఆకట్టుకుంది. అలాగే ఎన్టీఆర్ టెంపర్, రవితేజ కిక్ 2 చిత్రాలలో కూడా ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది అయితే ఇందులో పవన్ కళ్యాణ్ కు స్నేహితురాలి పాత్రలో మాత్రమే కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news