ఎన్టీఆర్ సినిమాలో స‌మంత‌.. రష్మికను నెట్టేసిందిగా..!

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` చిత్రం త‌ర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా ప‌ట్టాలెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిరోజుల కిందటే వెలువడింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. మ‌రియు ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వుంటుందనే టాక్ వచ్చిన దగ్గర నుంచి కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది.

రష్మిక కూడా తాజాగా సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంతా అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. కానీ, ఆ పాత్రకి సమంత అయితేనే సరిగ్గా సరిపోతుందని త్రివిక్ర‌మ్‌ భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను .. అటు ఎన్టీఆర్ కాంబినేషన్లోను నటించిన అనుభవం సమంతకి వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో ఆమె చేసిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇలా ర‌ష్మిక‌ను నెట్టేసి.. స‌మంత ఛాన్స్ ద‌క్కించుకుంద‌న్న‌మాట‌. అలాగే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news