ట్విట్టర్ లో మళ్లీ యాక్టివ్ కావాలని కొరటాలకు ఎన్టీఆర్ సలహా?

-

‘ ఆచార్య ‘ ఫలితం నుంచి బయటపడి.. ఎన్టీఆర్ సినిమా పనుల్లో మునిగిపోయారు కొరటాల శివ. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా.. ఎన్టీఆర్ సినిమా పైనే ఉంది. ఈ నేపథ్యంలో.. కొరటాలకు ఎన్టీఆర్ ఓ సలహా ఇచ్చాడు అన్నది టాలీవుడ్ టాక్. “గత సినిమాల ఫలితం గురించి ఆలోచించకు.. మనకథ మీదే ఫోకస్ పెట్టు.. కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో..” అని చెప్పాడట. అంతే కాదు కొరటాల ట్విట్టర్ లో యాక్టివ్ గా లేరు ఆయనకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నా ‘ ఆచార్య ‘ సమయంలో అందులోంచి బయటకు వచ్చేశారు.

ఇప్పుడు కొరటాలను మళ్ళీ ట్విట్టర్ లోకి రమ్మని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట.. తమ కాంబోలో సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వడానికి.. ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడానికి.. సినిమాలపై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ట్విట్టర్ వేదికగా ఉపయోగపడుతుందని.. ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వకపోతే.. వాళ్లు అసంతృప్తికి లోనవుతారు అని అందుకే ట్విట్టర్ లో మళ్ళీ యాక్టివ్ కావాలని ఎన్టీఆర్ కోరాడట.. అయితే కొరటాల మళ్ళీ ట్విట్టర్ లోకి రావడం దాదాపుగా కాయం అన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news