AI వండర్.. ఆకాశం, సముద్రం, పడవలతో ఎన్టీఆర్ ఫొటో

-

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం. దీంతో మనుషులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఖాయమని.. మానవాళికే ఇది ముప్పు అని ఇప్పటికే పలువురు నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా.. ఏఐతో అద్భుతాలు సృష్టించగలమనేది మాత్రం నిజం. ఏఐ మాయాజాలంతో ఇప్పటికే చాలా మంది వండర్స్ చేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏఐ ఎడిట్ ట్రెండ్ నడుస్తోంది. తమకు ఇష్టమైన సెలబ్రిటీల ఫొటోలను ఏఐ మాయతో ఎడిట్ చేసి సంతోషపడుతున్నారు కొందరు టెక్కీలు. తాజాగా ఓ టెక్కీ జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ఎడిట్ చేశాడు.

ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఈ పిక్‌ని తీక్షణంగా చూస్తే ఎన్టీఆర్‌ ముఖంలా కనిపిస్తుంది. నెట్టింట ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షించి, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెటిజన్లు, ఎన్టీఆర్‌ అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులూ ఈ పిక్చర్‌కు ఫిదా అవుతున్నారు. ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇల్యూషన్‌ టూల్‌ సాయంతో దాన్ని తీర్చిదిద్దారు. సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేయగా అది కొన్ని క్షణాల్లో లక్షల లైక్స్‌ సొంతం చేసుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news