Breaking : సభ నుంచి ఇద్దరూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. బాలయ్య మీసం తిప్పారని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరూ టీడీపీ సభ్యుల నుంచి సస్పెన్షన్ చేశారు. సభలో వీడియో తీసినందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసేంత వరకు వీరు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీటు పై విజిల్ వేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు అంబటి రాంబాబు టీడీపీ సభ్యుల ప్రవర్తన బాలేదని.. 20 సీట్ల కంటే ఎక్కువ రావని.. చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బాలయ్య కూడా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news