ఎన్టీఆర్ తో అట్లీ.. అదిరిపోయే కాంబో..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా తర్వాత రాజమౌళితో మల్టీస్టారర్ సినిమా చేస్తాడని తెలిసిందే. చరణ్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతో పాటుగా తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడని తెలుస్తుంది. కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ అట్లీతో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ ఈ సినిమాను నిర్మిస్తారట.

రీసెంట్ గా వైజయంతి బ్యానర్ లో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియలేదు. ఫైనల్ గా కోలీవుడ్ డైరక్టర్ అట్లీతో తారక్ సినిమా షురూ చేస్తున్నారు. తీసిన మూడు సినిమాలతోనే శంకర్, మురుగదాస్ రేంజ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అట్లీ ఎన్.టి.ఆర్ సినిమా అంటే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాను తెలుగు, తమిళ రెండు భాషల్లో తీస్తారట. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కే ఈ సినిమాతో తమిళనాట తెరంగేట్రం చేయనున్నాడు ఎన్.టి.ఆర్. మరి ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news