స్పెయిన్ లో తారక్ విల్లా..?

-

పోయి పోయి స్పెయిన్ లో ఎన్.టి.ఆర్ ఎందుకు ఇల్లు కొంటాడని డౌట్ రావొచ్చు. షూటింగ్ కోసం ఈమధ్య టాలీవుడ్ డైరక్టర్స్ స్పెయిన్ వెళ్తున్నారు. ఎన్.టి.ఆర్ కూడా బాద్షా నుండి స్పెయిన్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాడు. అయితే అక్కడకు వెళ్లినప్పుడు ఉండేందుకు సొంత ఇల్లు ఉంటే బెటర్ అనుకున్నాడో ఏమో సొత ఇల్లు కొనేస్తున్నాడట ఎన్.టి.ఆర్. తెలుగు సినిమాల్లో ఈమధ్య ఫారిన్ లొకేషన్స్ ఎక్కువయ్యాయి.

అంతేకాదు సినిమా మొత్తం ఫారిన్ లో తీసిన సినిమాలు ఉన్నాయి. స్పెయిన్ లో తరచు షూటింగ్స్ జరుగుతుండగా అక్కడ ఎన్.టి.ఆర్ ఓ ఇల్లు కొనేశాడట. అయితే దీనికి సంబందించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ కలిసి స్పెయిన్ లో 1.5 మిలియన్ డాలర్స్ తో అంటే మన కరెన్సీలో 10.5 కోట్ల మొత్తంతో అక్కడ విల్లా సొంతం చేసుకున్నారట. అక్కడ దేశం కూడా బయట దేశాలకు ఇల్లు తీసుకునే అవకాశం వచ్చింది. మరి స్పెయిల్ లో ఎన్.టి.ఆర్ ఇల్లు విషయమై మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news