రూలర్ కి చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్…!

-

గోరంత దాన్ని కొండంత చేసి చూడటం సిని అభిమానులకు వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా తమ అభిమాన హీరోకి ఇబ్బంది కలిగితే చాలు వాళ్ళు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడో వచ్చిన పుకారు ని నమ్మి దాన్ని పట్టుకుని వేలాడటం, సగం జ్ఞానం తో హడావుడి చేస్తూ ఉంటారు. ఇతర హీరోల అభిమానుల సంగతి పక్కన పెడితే నందమూరి హీరోల విషయానికి వచ్చి చూద్దాం. ప్రధానంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది.

అది ఎంత వరకు వాస్తవమో తెలియదు గాని రాజకీయ పరిణామాలను తీసుకొచ్చి సినిమాకు కలిపేసారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇటీవల కొందరు తెలుగుదేశం నేతలు తారక్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. దాన్ని మనసులో పెట్టుకుని బాలకృష్ణ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే కష్టంగా ఉందనే ప్రచారం ఎక్కువగా చేసారు కొందరు. దీన్ని పట్టుకుని వేలాడిన ఎన్టీఆర్ ఫాన్స్… ప్రస్తుతం విడుదలై భిన్నమైన టాక్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ రూలర్ సినిమాను టార్గెట్ చేసారు. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను, మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, బాలకృష్ణ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేయడం చేస్తున్నారు.

రూలర్ సినిమా బాలేదని, ప్రతి రోజు పండగ సినిమా బాగుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ రూలర్ ని ట్రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ పని అయిపోయిందని, ఆయన ఎందుకు పనికి రారని అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ వీడియోలు పెడుతున్నారు. దీనితో తమకు టైం వచ్చినప్పుడు తాము చూపిస్తాం అంటున్నారు బాలయ్య ఫాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news