బర్త్ డే కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ..!

-

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. నాలుగు భాషల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులందరు భారీగా అంచనాలను పెట్టుకున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటిస్తాడన్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ 30 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు ఆన్న టైటిల్ ని కన్‌ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఆన్ ఇండియా రేంజ్ లో స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు త్రివిక్రం. ఈ ఇయర్ ఎండింగ్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవనుందని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడన్న విషయంలో గత కొద్ది రోజులుగా ఆసక్తి నెలకొంది. అందుకు తెర దించబోతున్నాడట ఎన్.టి.ఆర్. తన బర్త్ డే అయిన మే 20 వ తేదీన తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్ రానుందని తాజా సమాచారం. అంటే ఆ సినిమా ఎన్.టి.ఆర్ 31 అన మాట. ఇప్పటికే ఎన్.టి.ఆర్. బర్త్ డే ఆల్రెడి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీం పాత్ర కి సంబంధించిన వీడియో టీజర్ రానుంది. ఇదే రోజు ఎన్.ట్.ఆర్ 31 అప్‌డేట్ కూడా వెలువడనుందట. దాదాపు ఆ ప్రాజెక్ట్ కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనే అని సమాచారం. మొత్తానికి ఎన్.టి.ఆర్. తన బర్త్ డే కి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news