ఆ ఛానల్‌ వ్యూయర్‌‌షిప్‌ పెంచేస్తున్న ఎన్టీఆర్‌‌

‘యంగ్‌ టైగర్‌’‌ ఎన్టీఆర్‌‌ హోస్ట్‌ చేస్తున్న టీవీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. జెమినీ టీవీలో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఈ షో ప్రసారమవుతోంది. గత నెల 22న మొదలైన ఈ షో ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జెమినీ టీవీ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగానే షో నడుస్తోంది.

 

కొంతకాలంగా టీఆర్‌‌పీ రేస్‌లో వెనుకబడ్డ జెమినీ టీవీ ఈ షోతో మళ్లీ వ్యూయర్‌‌షిప్‌ పెంచుకుంటోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రీమియర్‌‌ ఎపిసోడ్‌కు 11.40 టీఆర్‌‌పీ రాగా, మొదటివారం 5.2 రేటింగ్‌ సాధించింది. రెండోవారం ఇది మరింత పెరిగి 6.48 శాతం రేటింగ్‌ సాధించింది. దీంతో జెమినీ వ్యూయర్‌‌షిప్‌ 20 శాతం పెరిగినట్లు ఈ రేటింగ్స్‌ చెబుతున్నాయి. ఎన్టీఆర్‌‌ హోస్ట్‌ చేయడం ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ షో ఇలాగే ఆకట్టుకుంటే ఈ సీజన్‌ సక్సెస్‌ అయినట్లే.