2022 వరకు ఖాళీ లేదు …ఎన్ టి ఆర్

-

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తుండగా ఫిక్షన్ కథాంశంతో కమర్షియల్ సినిమాగా రూపుందుతుంది. కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించడమే కాదు చాలానే కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం సినిమాలో నటించడానికి రంగం సిద్దమవుతుంది.

 

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా రాబోతుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాల కొసం తారక్ చాలా శ్రమిస్తున్నాడట. అయితే 2021 లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల గ్యాప్ లోనే ఆర్ ఆర్ ఆర్ అలాగే త్రివిక్రం ఎన్టీఆర్ సినిమా రిలీజవుతుందని తాజా సమాచారం.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 2022 వరకు తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రమ్ సినిమాలలో ఒకేసారి పాల్గొననున్న ఎన్టీఆర్ ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండానే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట. ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2నుండి బయటికి వస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమాను 2021 డిసెంబర్ లో పట్టాలెక్కించనున్నారట. ఈ రకంగా 2022 వరకు తారక్ ఖాళీ లేకుండా ఉంటాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news