జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని.. పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ అంటే అభిమానుల్లో ఎంత ప్రత్యేకమైన అభిమానం వుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే తను సినిమాలలో నటిస్తున్నాడు అంటే దర్శకుల సన్నివేశాలకు తగ్గట్టుగా తనను తాను చేంజ్ చేసుకోవడానికి కూడా వెనుకాడడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ .. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అభిమానుల గురించి కొన్ని షాకింగ్ వార్తలు చేయడం గమనార్హం.ఎన్టీఆర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. పాత్ర డిమాండ్ చేస్తే మళ్లీ బరువు పెరగడానికి.. బరువు తగ్గడానికి ఏదైనా సిద్ధమేనని తెలిపారు. కథ అద్భుతంగా ఉంటే బరువు పెరగడంలో తప్పులేదు అని అలాంటి పాత్రలు చాలా తక్కువ మందికి మాత్రమే దొరుకుతాయని..ఎన్టీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతేకాదు ఎన్టీఆర్ మాట్లాడుతూ మేము ఎంటర్టైనర్స్.. కష్టపడకుండా ఫలితం దక్కదు అని ఎన్టీఆర్ ని కామెంట్ చేశారు. అలాగే అభిమానుల గురించి మాట్లాడుతూ కలలో కూడా నా అభిమానులు నా గురించి చెడుగా కోరుకోరు.. అభిమానులు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఫాన్స్ పై కూడా నేను అంతే అభిమానాన్ని చూపిస్తూ ఉంటాను అంటూ తెలిపారు ఎన్టీఆర్.
ప్రతి అభిమాని కూడా నాకు ఒక వజ్రంతో సమానం అంటూ ఎన్టీఆర్ అభిమానుల గురించి చాలా గొప్పగా మాట్లాడడంతో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం తన వరస ప్రాజెక్టులతో సక్సెస్ పొందాలి అని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉండడం గమనార్హం.